పైరసీకి పాల్పడితే మూడేళ్లు జైలు.. కేంద్రం కొత్త రూల్స్

-

ఇక నుంచి సినిమాలను పైరసీ చేస్తే మూడేళ్లపాటు జైలుశిక్ష ఉంటుందని కేంద్రం తెలిపింది. సినిమాల పైరసీని అడ్డుకునే విధంగా మార్పులు చేసిన 2023 సినిమాటోగ్రాఫ్ సవరణ చట్టానికి ఇవాళ రాజ్యసభ ఆమోదం తెలిపింది. మణిపుర్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు వాకౌట్ చేసిన నేపథ్యంలో.. బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

1952 సినిమాటోగ్రాఫ్ చట్టానికి సవరణగా ఈ బిల్లును తీసుకురాగా.. సినిమాలను పైరసీ చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ సవరణ బిల్లు రూపొందించారు. దీని ప్రకారం.. సినిమాల పైరసీ కాపీలను రూపొందించే వారికి మూడేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. సినిమా వ్యయంలో ఐదు శాతాన్ని నిందితులకు జరిమానాగా విధించనున్నారు.

మరోవైపు.. సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్​సీ) ఇచ్చే ధ్రువీకరణను ప్రస్తుతం ఉన్న పదేళ్ల కాలానికి బదులుగా.. శాశ్వతంగా కొనసాగేలా చట్ట సవరణ చేశారు. వయసు ఆధారంగా ఇచ్చే సెన్సార్ సర్టిఫికేషన్​లో కేటగిరీలు తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు. ‘యూఏ7 ప్లస్’, ‘యూఏ 13 ప్లస్’, ‘యూఏ 16ప్లస్’ కేటగిరీలను తీసుకురావాలని ప్రతిపాదించారు. టీవీలు, ఇతర మాధ్యమాల కోసం ప్రత్యేక సర్టిఫికేట్ జారీ చేసే అధికారాన్ని సీబీఎఫ్​సీకి కట్టబెడుతూ చట్టంలో సవరణ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news