‘టిల్లు స్క్వేర్’ కలెక్షన్లు @రూ.78 కోట్లు

-

సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు (Tillu Square) యూత్ నీరాజనం పడుతున్నారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే డిజె టిల్లు కు సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సినిమా చరిత్ర సృష్టించింది.

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వల్ చిత్రాలు పెద్దగా ఆకట్టు కోవనే ప్రచారం ఉంది. అయితే ఆ ప్రచారానికి టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ వేసింది. అటు టిల్లు స్క్వేర్ సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 78 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. మరో రెండు రోజుల్లోనే 100 కోట్లు కూడా క్రాస్ చేస్తుందని చిత్ర బృందం ఆశ భావం వ్యక్తం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news