ఎంత ట్రై చేసినా నిద్రరావడం లేదా..? ఈ అబద్ధం చెప్పండి వెంటనే నిద్రపడుతుంది..!

-

కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా నిద్రరాదు.. అసలు ఈ నిద్ర ఏంటో.. ఏం పని లేదు ప్రశాంతంగా పడుకుందాం అనుకున్నప్పుడు రాదు, మంచి వర్క్‌లో ఉన్నప్పుడు తెగ నిద్రొస్తుంది. అందుకే ఈ సమస్యకు ఓ డాక్టర్‌ పరిష్కారన్ని కనిపెట్టారు. అది రివర్స్ సైకాలజి లాంటి లేదా పారాడాక్సికల్ ఇంటెన్స్‌తో కూడినది. అది పనిచేస్తుందని తాను కూడా అనుకోలేదట, కానీ ఆశ్చర్యంగా అది తనకు చాలా త్వరగా నిద్రలోకి జారుకునేందుకు ఉపయోగపడిందని పేర్కొన్నారు. ఇంతకీ అదేంటంటే..

నిద్ర రావడం లేదు అని అనిపించగానే.. ‘ఇక నేను నిద్రపోను’ అనుకోండి. అలా అని బుక్ చదడమో, టీవీ చూడడమో, ఫోన్ స్క్రోల్ చెయ్యడం లాంటివేవీ చెయ్యకూడదు. సింపుల్‌గా నేను నిద్రపోను అని అనుకోవాలి అంతే. ఇదెలా అంటే మంచం మీద పడుకొని మిమ్మల్ని మీరు ఇక నిద్ర పోకూడదు అని బలవంత పెట్టడం లాంటిదన్న మాట. నిద్రపోవద్దు పోవద్దు అని మీకు చెప్పుకుంటూ ఉండండి. చాలా సార్లు మీరు అలసి పోయి ఉంటారు.. నిద్రపోవద్దు అని చెప్పడం ద్వారా పదేపదే నిద్రను గుర్తు చేస్తుంటారు. నిద్ర పోవద్దు అనే సూచన ఇచ్చిఇచ్చి అలసిపోయి.. మీకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు’’ అని డాక్టర్ రాజన్ తెలిపారు.

ఎవరైనా మీకు దేని గురించైనా ఆలోచించవద్దు అని చెబితే.. ముందుగా మీరు దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. మన బ్రెయిన్‌ అంతే వద్దన్న పనే ముందు చేస్తుంది. అలాంటిదే ఈ రివర్స్ సైకాలజీ కూడా.

మీరు నిజంగా నిద్రలేమితో బాధ పడుతున్నారో తెలుసుకోవాలనుకుంటే కింది లక్షణాల్లో ఏవైనా మీకు ఉన్నాయోమో పరిశీలించండి.

  • నిద్ర పోవడానికి కష్ట పడడం
  • రాత్రి చాలా సార్లు మెలకువ వచ్చి తిరిగి నిద్ర పట్టేందుకు సమయం పట్టడం
  • మంచం మీద కళ్లు తెరచుకుని నిద్ర కోసం వేచి ఉండడం
  • ఉదయం త్వరగా మేల్కొన్నప్పటికీ రాత్రి త్వరగా నిద్రపోలేక పోవడం
  • అలసి పోయినా సరే నిద్ర కోసం వేచి ఉండాల్సి రావడం
  • పొద్దున్న నిద్ర లేచినపుడు కూడా తాజాగా అనిపించకపోవడం
  • పగటి పూట అలసటగా చికాకుగా అనిపించడం
  • ఈ లక్షణాలతో పాటు పని మీద ఏకాగ్రత కుదరకపోవడం, ఎప్పుడూ మూడ్ సరిలేకపోవడం, విసుగ్గా అనిపించడం, చేసే పని నాణ్యత తగ్గడం ఇలా రకరకాల సమస్యలన్నీ నిద్ర లేమి వల్లే కలుగుతాయి.

నిద్ర మనిషికి చాలా అవసరం. ఎక్కువ కాలం నిద్రలేమితో బాధపడుతుంటే మాత్రం అస్సలు లైట్‌ తీసుకోకండి. ఏదో ఒక చిట్కానో, మెథడో, చికిత్సనో పాటించడం మొదలుపెట్టాల్సిందే..!

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

 

Read more RELATED
Recommended to you

Latest news