బాలకృష్ణ – బోయపాటి శ్రీను ల “సింహ” కి 10ఏళ్ళు ..!

-

బోయపాటి శ్రీను నట సింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ అనగానే ఇప్పుడు ఎవరికైనా ఒక ఉత్సాహం వస్తుంది. ఈ కాంబినేషన్ లో సినిమా అంటే ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ కి యమా జోష్ ఉంటుంది. అందుకు కారణం ఈ ఇద్దరి కాంబినేషన్ లో మొదటిసారిగా వచ్చిన సింహ సినిమా. ఈ సినిమాతో బాలయ్య సెన్షేనల్ హిట్ ని అందుకున్నారు. బోయపాటి శ్రీను అప్పటికే రవితేజ తో భద్ర, వెంకటేష్ తో తులసి సినిమాలని తీసి బ్యాక్ టు బ్యాక్ రెండు బ్లాక్ బస్టర్స్ ని అందుకొని ఉన్నాడు. దాంతో ఈ కథ చెప్పగానే బాలకృష్ణ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

 

Simha BGM | Balakrishna | Chakri | Boyapati Srinu - YouTube

రెండు వైవిధ్యమైన పాత్రలను వెండితెరమీద అంద్భుతంగా ఆవిష్కరించాడు బోయపాటి. శ్రీమన్నారయణ, డాక్టర్ నరసింహ గా రెండు పాత్రల్లో బాలకృష్ణ అదరహో అనిపించారు. చెప్పాలంటే ఈ సినిమాతో బాలకృష్ణ మంచి ఫాం లోకి వచ్చారు. డిఫ్రెంట్ మేకోవర్ తో బోయపాటి బాలయ్య ని చూపించిన విధానానికి చిత్ర పరిశ్రమనుంచి అలాగే సినిమా క్రిటిక్స్ నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు. ఇక ఈ సినిమాతో నయనతారకి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది.

 

ఇక దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత బాలకృష్ణ సింహ సినిమాతో సెన్షేనల్ హిట్ ని అందుకున్నారు. ఇక దర్శకుడిగా బోయపాటికి ఈ సినిమా హ్యాట్రిక్ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత మరోసారి 2014 లో బోయపాటి శ్రీను బాలకృష్ణ తో లెజెండ్ సినిమాని తెరకెక్కించగా ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన బోయపాటికి బాలయ్య కి మంచి ట్యూనింగ్ ఏర్పడింది మాత్రం సింహ సినిమాతోనే. ఈ సినిమా రిలీజయి ఈ రోజుకి విజయవంతంగా 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక మరోసారి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతుంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news