బిగ్​బాస్ సీజన్​ 8లోకి టాలీవుడ్ హీరో!

-

బిగ్ బాస్ సీజన్-8 తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్​ ఫస్ట్ లేదా 8వ తేదీన సరికొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు సమాచారం​. ఈసారి హౌజ్ లోకి వెళ్లే కంటెస్టులు వీళ్లేనంటూ ఓ లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ లిస్టులో టాలీవుడ్​ హీరో కూడా ఉన్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా నీలో అంటూ తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టిన అభినవ్ గోమఠం ఈ సారి బిగ్ బాస్ లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. కమెడియన్ నుంచి హీరో స్థాయికి ఎదిగిన అభినవ్ ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో అడుగు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. అభినవ్ తో పాటు నయని పావని, వింధ్య విశాఖ, జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ, అమృతా ప్రణయ్, రీతూ చౌదరి, కుమారీ ఆంటీ, బర్రెలక్క, యూట్యూబర్ బమ్ చిక్ బబ్లూ, నటి సోనియా సింగ్, హీరోయిన్ కుషితా కల్లపు ఈసారి కంటెస్టులుగా రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version