ACA నూతన అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఎంపికైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ACA ను బీసీసీఐ లో ప్రతిష్టాత్మకంగా మారేలా చర్యలు తీసుకుంటాం. సెలెక్షన్ సహా అన్నిటిలో సిఫార్సులు లేకుండా నిష్పక్షపాతంగా జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు. అలాగే ACA నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు తయారు అయ్యేలా చూస్తాం. అయితే ACA కి ఏకగ్రీవంగా అధ్యక్షుడిని చేసినందుకు ధన్యవాదాలు.
విద్యార్థుల నుంచి చాలా మందికి క్రికెట్ అంటే ఇష్టం. ఇండియాలో బాగా ప్రాచుర్యంలో ఉన్న క్రీడగా క్రికెట్ ఉంది. పాఠశాల స్థాయి నుంచి కలశాల స్థాయి వరకు లీగ్ లను తీసుకువెళ్తాం. పోటీ పడే తత్వం ఉండే క్రీడాకారులను ACA తయారు చేస్తుంది. కొచ్ లు అకాడమీ లు స్టేడియంల అవసరం ఉంది. కాబట్టి ప్రతి జిల్లాలో క్రికెట్ స్టేడియం ఉండేలా చర్యలు చేపడతాం. పాఠశాల దశ నుంచి పిల్లలు క్రికెట్ లీగ్ లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటాం అని కేశినేని చిన్ని పేర్కొన్నారు.