వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ నిన్న సౌత్ ఆఫ్రికా తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో అయిదు వికెట్లతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా ను తమ బౌలింగ్ తో 244 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి మూడు ఓవర్ ల వరకు తీసుకువచ్చింది. ముఖ్యంగా రషీద్ ఖాన్, నబి మరియు నూర్ అహమద్ లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో అంతవరకు మ్యాచ్ వచ్చింది. మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ మాట్లాడుతూ, మా జట్టులోని ఆటగాళ్లకు నాచురల్ టాలెంట్ ఉందని కామెంట్స్ చేశాడు.. మా దేశంలో సరైన గ్రౌండ్స్, శిక్షణ ఇతర సదుపాయాలు లేకపోయినా వరల్డ్ కప్ లో మెరుగైన ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు రషీద్ ఖాన్. ఈ వరల్డ్ కప్ లో మా జట్టులోని ఆటగాళ్లు తమ తమ పరిధిలో ప్రపంచ స్థాయికి తగినట్లు ఆడి దేశం గర్వించేలా చేశారని రషీద్ ఎమోషనల్ అయ్యాడు.
ఇక ఆఫ్ఘనిస్తాన్ ఆడిన మ్యాచ్ లలో నాలుగు విజయాలు సాధించి సెమీస్ కు చేరడానికి చాలా కష్టపడింది. కానీ ఆస్ట్రేలియా మ్యాచ్ లో మాక్స్ వెల్ పోరాటం ముందు ఓడిపోయింది.