టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్‌కు స్పోర్స్ట్ అంటే ఇష్టమన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్, ఫుట్‌బాల్‌కు నిఖిల్ వీరాభిమాని. ఆ మ్యాచ్‌లను తరచూ ఫాలో అవుతుంటాడు. అయితే తాజాగా సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ ప్రదర్శన పట్ల నిఖిల్ అసహనం వ్యక్తం చేశాడు. గతేడాది నవంబర్ నుంచి మన జట్టు ఒక్క గోల్ కూడా కొట్టకపోవడం ఏం బాలేదని ట్వీట్ చేశాడు.
ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో మన జట్టు ప్రదర్శన నిరాశకు గురి చేసిందని నిఖిల్ అన్నాడు. ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. అత్యధిక జనాభా ఉన్న దేశంగా మరెంతో సాధించాలన్న నిఖిల్.. మన జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో గతేడాది జరిగిన ఖతార్ మ్యాచ్ (ఖతార్ 3 గోల్స్ చేయగా.. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేదు) తెలియజేస్తుందని వివరించాడు. నవంబర్ నుంచి మన జట్టు ఒక్క గోల్ కూడా చేయకపోవడం బాధాకరమని వాపోయాడు.
The Qatar match pic is to show how bad the Form of the @IndianFootball has been recently… We haven't scored a Goal since November of last year.. let that sink in… not even one goal scored. We Cudnt even beat a depleted #Afghanistan team … Entire System Overhaul is needed…
— Nikhil Siddhartha (@actor_Nikhil) March 22, 2024
సంక్షుభిత దేశమైన అఫ్గానిస్థాన్ జట్టునూ ఓడించలేకపోయామని, టీమ్‌ను పునర్నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.
Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers
The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw— Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024