భారత్ ఎప్పటికీ మిత్రదేశమేనంటూ.. మాట మార్చిన మాల్దీవులు

-

చైనా అండ చూసుకుని భారత్‌పై గత కొంతకాలంగా అక్కసు వెళ్లగక్కుతున్న మాల్దీవుల దేశాధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు ఒక్కసారిగా మాట మార్చారు. భారతదేశం మాల్దీవులకు ఎప్పటికీ సన్నిహిత మిత్ర దేశమేనని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు తెలిపారు. భారత సైన్యం మాల్దీవులను విడిచిపెట్టి వెళ్లాల్సిందేనంటూ పట్టుబట్టిన ముయిజ్జు చేసిన తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి.

మహ్మద్ ముయిజ్జు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. మే 10 నాటికి భారత్‌కు చెందిన బలగాలు తమ దేశాన్ని వీడి వెళ్లిపోవాలని గడువు విధించిన విషయం తెలిసిందే. భారత్‌తో సంబంధాలు బలహీనపడుతుంటం వల్ల ముయిజ్జు సర్కార్‌ అత్యవసర వైద్య సేవల కోసం శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ముయిజ్జు తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అయితే గతేడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్‌ డాలర్లు బకాయిపడదాయ. దీనిని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని ఇప్పుడు ముయిజ్జు ప్రాధేయపడుతున్నారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ముయిజ్జు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news