జనసేనకు 24 స్థానాలు కేటాయించడంపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేనకు అతి తక్కువగా 24 స్థానాలు మాత్రమే కేటాయిస్తారా? అని సాక్షి దినపత్రిక మళ్లీ గోల చేయడం ప్రారంభించిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. ఒక స్థానంలో జనసేన అభ్యర్థికి గత ఎన్నికల్లో 30 వేల ఓట్లు వచ్చినప్పటికీ, ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించరా? అని సాక్షి దినపత్రిక ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, అదే స్థానంలో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వ్యక్తికి 60 వేల ఓట్లు వచ్చాయని, ఈ విషయాన్ని మాత్రం సాక్షి దినపత్రిక తన కథనంలో ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు.
సాక్షి దినపత్రిక ఇటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించకుండా, రెండు పార్టీల క్యాడర్ మధ్య గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నాన్ని చేస్తోందని పేర్కొన్నారు. అన్ని గొడవలు సద్దుమణిగి చక్కటి అవగాహనతో ఉన్న టీడీపీ, జనసేన నాయకుల మధ్య చిచ్చుపెట్టాలన్నదే సాక్షి దినపత్రిక లక్ష్యం అన్న ఆయన, ఇప్పటికీ సాక్షి దినపత్రిక తన ఆఖరి ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. జనసేన పార్టీ నాయకత్వం అత్యద్భుతంగా సీట్లను ఎంపిక చేసుకుందని, గతంలో ప్రజారాజ్యం పార్టీ నెగ్గిన స్థానాలను, వారికి పట్టున్న జిల్లాలలోని స్థానాలనే పొత్తులో భాగంగా ఎంపిక చేసుకున్నారని, సీట్ల సర్దుబాటు చక్కగా జరిగిన తరుణంలో, ఏదో ఒక ఊరు పేరు రాసి, ఆ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించరా? అని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
దుర్గేష్ గారికి ప్రత్యామ్నాయన్ని చూపెట్టారన్న రఘురామకృష్ణ రాజు గారు, గత ఎన్నికల్లో టీడీపీకి 23 స్థానాలు వచ్చినప్పుడు, బుచ్చయ్య చౌదరి గారు 12 వేల మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారన్నారు. పాత తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు అయిన దుర్గేష్ గారికి పక్కనే ఉన్న స్థానాన్ని కేటాయించారని తెలిపారు. అయినా దుర్గేష్ గారికి అన్యాయం జరిగిందని సాక్షి దినపత్రిక పేర్కొనడం పరిశీలిస్తే, ఇతర పార్టీల వ్యవహారాలు నీకెందుకు రా సాక్షి… అక్కు పక్షి అని అనాలనిపిస్తోందని అన్నారు.