టాలీవుడ్ నెంబర్ 1 మహేష్

-

సూపర్ స్టార్ మహేష్ మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. అదేంటి భరత్ అనే నేను వచ్చి చాలా రోజులవుతుంది కదా ఇప్పుడు మహేష్ కొత్తగా ఏం చేశాడు అంటే. మహేష్ సినిమాలు వచ్చినా రాకున్నా రికార్డులు మాత్రం కొల్లగొడుతూనే ఉన్నాడు. లేటెస్ట్ గా ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ తో మహేష్ మరోసారి టాలీవుడ్ నెంబర్ 1 తానే అని ప్రూవ్ చేసుకున్నాడు.

ట్విట్టర్ ఫాలోవర్స్ లో మహేష్ రేంజ్ వేరేలా ఉంది. 70 లక్షల మంది మహేష్ ఫాలో చేస్తున్నారు అంటే మాములు విషయం కాదు. 2010 ఏప్రిల్ లో ట్విట్టర్ లో జాయిన్ అయిన మహేష్ ఇప్పటివరకు క్రేజీ ఫాలోవర్స్ ను ఏర్పరచుకున్నాడు. తనకు సంబందించిన విషయాలను మాత్రమే ట్వీట్ చేసే మహేష్ ఈమధ్య ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటున్నాడు. సౌత్ స్టార్స్ లో ధనుష్ నెంబర్ ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు.

ధనుష్ ఏకంగా 7.83 మిలియన్ ఫాలోవర్స్ తో ముందు ఉన్నాడు. సూపర్ స్టార్ రజిని కూడా 4.88 మిలియన్ ఫాలోవర్స్ తో వెనుకపడి ఉన్నాడు. తెలుగులో మాత్రం మహేష్ దరిదాపుల్లో కూడా ఎవరు రాలేదు. ఇక తెలుగులో ఎన్.టి.ఆర్ 2.63 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగి ఉండగా.. పవన్ కళ్యాణ్ 3.29 మిలియన్స్.. అల్లు అర్జున్ 2.8 మిలియన్ ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version