మమ్మల్ని ఆదుకోండి… నిర్మాతలు…!

-

ఇప్పుడు టాలీవుడ్ లో నిర్మాతలు కరోనా దెబ్బకు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇప్పట్లో సినిమా షూటింగ్ అనేది జరిగే అవకాశం అనేది కనపడటం లేదు. దీనితో పెట్టుబడి పెట్టిన నిర్మాతలు రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. అగ్ర నిర్మాతల పరిస్థితి ఏమో గాని… చిన్న చిన్న నిర్మాతల పరిస్థితి ఇప్పుడు మరీ దారుణంగా ఉంది. వాళ్ళు వడ్డీలకు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతూ ఉంటారు.

ఆ వడ్డీ కూడా భారీగా ఉంటుంది. పొలాలు తాకట్టు పెట్టి సినిమా మీద పిచ్చితో సినిమాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా బయటపడాలి. లేకపోతె కుటుంబాలు రోడ్డున పడటమే కాదు చిన్న చిన్న సినిమాల నిర్మాణం ఆగిపోయి వేలాది మంది కార్మికులు రోడ్డున పడే అవకాశం ఉంటుంది. దీనితో వాళ్ళు ఇప్పుడు తమను ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. అది ఏ విధంగా అంటే…

పెద్ద సినిమాలకే కాదు చిన్న చిన్న సినిమాలకు కూడా టికెట్ ధరలను పెంచాలి అని కోరుతున్నారు. అలా అయితేనే తాము బయటపడటం సాధ్యం అవుతుంది అని విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు టికెట్ ధరలను కనీసం 20 రూపాయలు అయినా పెంచాలి అని భావిస్తున్నారు. లేకపోతే కష్టాలు పడతాం అని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వ౦ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news