ప్రముఖ సీనియర్ నటి రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఈ విషాద ఘటనను సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశారు. రకుల్ ప్రీతిసింగ్ ఇంట్లో ఏమైంది? ఎందుకు అంత విషాదం? అనే విషయానికి వస్తే.. రకుల్ ప్రీతిసింగ్ గత 16 సంవత్సరాలుగా ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న తన పెట్ మరణించడంతో ఈమె ఎమోషనల్ అయ్యారు . ఈ క్రమంలోనే తన పెట్ గురించి సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్టు కూడా చేశారు.
ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ తన పెట్ బ్లాసమ్ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది.” బ్లాసమ్ నువ్వు మా జీవితాలలోకి 16 సంవత్సరాల క్రితం వచ్చావు. మా జీవితాల్లోకి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొచ్చావు. ఇకపై నిన్ను మేము ఎంతో మిస్ అవుతాము. ఇక్కడ నువ్వు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడిపావు. వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి బాధలు లేకుండా వెళ్లిపోయావు ..ఈ విషయంలో నాకు సంతోషంగా ఉంది. నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ఈమె ఒక పోస్ట్ షేర్ చేసింది.
ఇకపోతే రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ఫోటోలు బాగా వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఆమెకు ఆ పెట్ అంటే ఎంత ఇష్టమో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ కే పరిమితమైన ఈమె గతంలో తమిళ్ సినిమాలలో కూడా నటించి మెప్పించింది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
View this post on Instagram