ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కొత్త‌ సినిమా టైటిల్ భ‌లేగా ఉందే..?

-

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తాజాగా అల్లు అర్జున్‌తో ‘అల వైకుంఠపురములో’ అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని మంచి జోష్ మీదు ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా త్రివిక్ర‌మ్‌ ఒక చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి `ఆర్ఆర్ఆర్` షూటింగ్ తో బిజీగా ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. అయితే తాను దర్శకత్వం వహించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు ‘అ’ అనే అక్షరంతోనే మొదలవుతాయి.

అతడు నుంచి మొదలైన ఈ సెంటిమెంట్ ఆ తర్వాత “అ..ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత. వీర రాఘవ, అల వైకుంఠపురములో” చిత్రాల వరకు కొనసాగింది. తాజాగా త్రివిక్రమ్ చేయబోయే సినిమాకి కూడా ‘అ’ తోనే మొదలయ్యే టైటిల్ ని ఫిక్స్ చేశారట త్రివిక్రమ్. ఈ నేప‌థ్యంలోనే ఈ మూవీకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. కాగా, మే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news