అడ్వాన్స్ తిరిగిచ్చేసిన త్రివిక్రం..!

-

అరవింద సమేత తర్వాత త్రివిక్రం కోసం వెంకటేష్, బన్ని ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు. తన తర్వాత సినిమా కూడా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లోనే చేయాలని చూస్తున్నాడు త్రివిక్రం. అందుకే మరో నిర్మాత డివివి దానయ్యకు డబ్బులు తిరిగి ఇచ్చాడట. త్రివిక్రంతో దానయ్య కొన్నాళ్ల క్రితం సినిమా కోసం కొంత మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చాడట.

జులాయి సినిమా నుండి త్రివిక్రం కేవలం రాధాకృష్ణతోనే సినిమాలు చేస్తున్నాడు. మధ్యలో దానయ్యతో సినిమా చేస్తాడని వార్తలొచ్చినా అవి కుదరలేదు. అందుకే తనకు సినిమా అయినా చేయండి లేదంటే ఇచ్చిన అడ్వాన్స్ అయినా తిరిగివ్వండని దానయ్య అన్నాడట. చేసేదేం లేక త్రివిక్రం అడ్వాన్స్ డబ్బుని వెనక్కి ఇచ్చేశాడట.

భరత్ అనే నేను సినిమా నిర్మాతగా దానయ్య ఈ ఇయర్ ఆల్రెడీ ఓ హిట్ కొట్టాడు. ఇక ప్రస్తుతం చరణ్, బోయపాటి శ్రీను సినిమాను నిర్మిస్తున్నాడు. రాజమౌళి మల్టీస్టారర్ సినిమా నిర్మాత కూడా డివివి దానయ్యే. అందుకే ఇక త్రివిక్రంతో సినిమా చేసే ఛాన్స్ లేదనే అడ్వాన్స్ రిటర్న్ తీసుకున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news