త్రివిక్రం, విజయ్ దేవరకొండ సినిమా మిస్..!

-

మాటల మాంత్రికుడు త్రివిక్రం, యువ సంచలనం విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉండేది. అబ్బో కాంబినేషన్ అనుకుంటేనే సూపర్ అనిపిస్తుంది అలాంటిది ఈ కాంబో కలిసి సినిమా చేస్తే ఆడియెన్స్ కు మంచి కిక్ ఇచ్చే సినిమా అవుతుంది. అయితే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయ్యిందట. నందిని రెడ్డి కథ, స్క్రీన్ ప్లే రాసుకుని ఓ కథ త్రివిక్రం దగ్గరకు తీసుకెళ్లిందట.

త్రివిక్రం డైరక్షన్ లో ఆ సినిమా చేయాలని కోరిందట. విజయ్ దేవరకొండ హీరోగా పర్ఫెక్ట్ అని చెప్పిందట. అయితే కథలో చాలా లేయర్స్ ఉన్నాయని.. ఇది ఒకరితో చేసే సినిమా కాదని వద్దనేశాడట త్రివిక్రం. అంతేకాదు అదే టైంలో ఎన్.టి.ఆర్ తో సినిమా కన్ఫాం అవడంతో ఆ సినిమా వదిలేశాడట. అదే స్వప్నా దత్ నెటి ఫిల్క్స్ తో కలిసి గ్యాంగ్ స్టర్స్ గా వెబ్ సీరీస్ తీశారని చెప్పారు ప్రముఖ రైటర్ లక్ష్మి భూపాల.

నందిని రెడ్డి ఆ వెబ్ సీరీస్ కు క్రియేటివ్ హెడ్ గా పనిచేశారు. జగపతి బాబు, నవదీప్ లాంటి స్టార్స్ ఆ వెబ్ సీరీస్ లో నటించారు. ఒకవేళ సినిమాగా వచ్చుంటే ఆ కథకు న్యాయం జరిగేదేమో మరి.

Read more RELATED
Recommended to you

Latest news