తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 కొనసాగుతోంది. బిగ్ బాస్ సీజన్ 8 లో కొందరు కంటెస్టెంట్స్ పై దారుణంగా ట్రోల్స్ పడుతున్నాయి. డల్ గా ఉన్న వాళ్ళని ఒక ఆట ఆడేసుకుంటున్నారు. బిగ్బాస్ 8వ సీజన్ ఈ ఆదివారం గ్రాండ్ గా ప్రారంభమైంది 14 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ ఒకటిన ఈ షో స్టార్ట్ అయింది. ఎప్పటిలానే మరో 6, 7 మంది కంటెస్టెంట్ లని వైల్డ్ కార్డు ద్వారా తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 14 మందితో స్టార్ట్ అయిన బిగ్ బాస్ వాడి వేడిగా సాగింది. కంటెస్టెంట్లు చిటికీమాటికీ గొడవ పడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
మొదటి రోజు నుంచి స్ట్రాటిజీని ప్రారంభించినట్లు ఉంది. ప్రతి దానికి కూడా వారు గొడవ పడుతూ అరుస్తూ కెమెరాల ముందు కనబడుతున్నారు. ఎపిసోడ్లో ఇదే హైలెట్ అవుతాయని వాళ్ళు ప్రవర్తిస్తున్నట్లు చాలామంది జెన్యూన్ గా కనిపించట్లేదు. కెమెరాల ముందు యాక్టింగ్ చేస్తున్నట్లు ఉందని కామెంట్లు వినపడుతున్నాయి. కొందరు కంటెస్టెంట్లని నెత్తిన పెట్టుకొని ప్రమోట్ చేస్తున్నారు. కొంత మందిని దారుణంగా విమర్శిస్తున్నారు. ఒక్కొక్కరు ఛాన్స్ వస్తే చాలు రెచ్చిపోతున్నారు. అయితే ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్లని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ముఖ్యంగా అందులో ఆదిత్య ఓం ఉన్నారు. ఓపెనింగ్ రోజు స్టేజ్ పై చాలా యాక్టివ్ గా కనపడ్డారు. ప్రతిదానికి నవ్వుతూ ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు. హౌస్ లోకి వచ్చిన తర్వాత మాత్రం సైలెంట్ అయిపోయారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభమై ఐదు రోజులు అవుతోంది. ఇప్పటిదాకా ఆదిత్య బాగా హైలైట్ అయిన సందర్భం ఒకటి కూడా లేదని కామెంట్లు వస్తున్నాయి. నామినేషన్స్ లో ఎలాగో కనిపించాలి కాబట్టి కనబడ్డాడు అతనిపై విమర్శలు వస్తున్నాయి.
ఫాలోవర్స్ మాత్రమే ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. బేబక్క కూడా ట్రోల్స్ కి గురవుతున్నారు. కుళ్ళు జోకులు సెటైర్లతో ఆమె కనపడుతోంది. ఆటలో మాత్రం యాక్టివ్ గా లేదు ఆమెతో పాటుగా శేఖర్ భాష కూడా డల్ గా ఉన్నారు. ఆర్జేగా ఆయనకు ఎంతో పేరు ఉంది. బిగ్బాస్ హౌస్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపించట్లేదు కూడా. డల్ గా ఉన్నట్లు నాగ మణికంఠ ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తున్నాడు. ఎక్కువ ఎమోషనల్ అవుతూ చిరాకు తెప్పిస్తున్నాడు. పృథ్వీరాజ్ కూడా డల్ గా కనబడుతున్నాడు. అభయ్ నవీన్ కూడా గేమ్ ని మొదలుపెట్టలేకపోతున్నాడు.