కేజీఎఫ్ అద్భుతమైన సినిమా: కేటీఆర్

-

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పుడప్పుడూ సినిమాలు చూసి సేద తీరుతుంటారు. సినిమాలు చూసిన తర్వాత ఆయనకు నచ్చితే దానిపై ట్వీట్ కూడా చేస్తుంటారు. తాజాగా ఆయన కేజీఎఫ్ సినిమా చూశారట. కన్నడ హీరో యష్ నటించిన ఈ మూవీ కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందింది. అయితే.. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర దాదాపు 250 కోట్లను రాబట్టింది.

ఈ సినిమాను చూసిన తర్వాత కేటీఆర్ ట్విట్టర్ లో సినిమాను ప్రశంసించారు. కొంచెం ఆలస్యంగా కేజీఎఫ్ చూశా. సినిమా చాలా బాగుంది. సాంకేతికంగా ఆకట్టుంది. ఉత్కంఠగా, కూల్ గా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం అదుర్స్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఇక.. యష్ స్క్రీన్ ప్రజెన్స్ గ్రేట్ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version