సైరా షూటింగ్ ను అడ్డుకున్నారు..!

-

మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం బీదర్ లో జరుగుతుంది.

అయితే అక్కడ బహుమని కోటలో షూటింగ్ జరుపుతుండగా కొంతమంది ముస్లీం యువకులు షూటింగ్ ఆపేయాలని అడ్డుకునారట. ముస్లీ ప్రార్ధనా స్థలమైన బహుమని కోటలో హిందు దేవుళ్ల విగ్రహాలు పెట్టరాదని వారు డిమాండ్ చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు సైరా షూటింగ్ ఆపేసినట్టు తెలుస్తుంది. చిత్రయూనిట్ మాత్రం పురావస్తు శాఖ అనుమతి తీసుకునే షూటింగ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయినా సరే సైరా షూటింగ్ కు ప్రస్తుతానికి అంతరాయం కలిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version