త‌నీష్ హీరోయిన్‌కు పెళ్లైపోయింది!

-

త‌నీష్ దాదాపు ఎనిమిదేళ్ల క్రితం న‌టించిన చిత్రం `మేం వ‌య‌సుకు వ‌చ్చాం`. ఈ సినిమాతో ఢిల్లీ సోయ‌గం నీతీ టేల‌ర్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైంది. గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటున్న నీతీ టేల‌ర్ ఉన్న‌ట్టుండి షాకిచ్చింది. పెళ్లి పుస్త‌కం, ల‌వ్ డాట్‌కామ్ వంటి చిత్రాల్లో మెరిసింది. 2014 త‌రువాత తెలుగు చిత్రాల్లో క‌నిపించ‌కుండా పోయింది.

తాజాగా పెళ్లి చేసుకున్నానంటూ ఓ వీడియోని పోస్ట్ చేసి షాకిచ్చింది. సినిమాల‌కు దూరంగా వుంటున్న నీతీటేల‌ర్ ప్రైట్ మ్యూజిక్ వీడియోస్‌తో పాటు ప‌లు హిందీ టీవీ షోస్‌లో క‌నిపించి సంద‌డి చేసింది. గ‌త కొంత కాలంగా టీవీ షోస్‌కి కూడా దూరంగా వుంటూ వ‌స్తున్న నీతీ టేల‌ర్ తాజాగా త‌న చిన్న‌నాటి స్నేహితుడు ప‌రీక్షిత్ భ‌వ‌ను పెళ్లాడింది. ఆగ‌స్టు 13న పెళ్లి జ‌రిగితే తాజాగా త‌న పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోల‌ని షేర్ చేసి పెళ్లి వార్త చెప్పి షాకిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version