వేణు స్వామి దంపతులు చేసిన ఆరోపణలపై టీవీ5 మూర్తి తాజాగా స్పందించారు. వేణు స్వామి దంపతులు అనవసరంగా తప్పుడు నిర్ణయం తీసుకోకూడదని… ఆత్మహత్య మంచిది కాదని తెలిపారు. సోమవారం రోజున.. టీవీ5 మూర్తి పై సంచలన ఆరోపణలు చేస్తూ వేణు స్వామి వీడియో పెట్టారు. ఇందులో తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుంటుందని.. ఐదు కోట్లు టీవీ5 మూర్తి అడుగుతున్నాడని… ఆరోపణలు చేయడం జరిగింది.

అయితే ఈ వీడియో పైన వెంటనే టీవీ5 మూర్తి స్పందించారు. అసలు వేణు స్వామి తల పైన ఐదు రూపాయలు కూడా రావని.. అలాంటి వ్యక్తిని ఐదు కోట్ల రూపాయలు నేను ఎలా అడుగుతానని కూడా ప్రశ్నించారు. మిమ్మల్ని వేధిస్తున్న ఆ గ్యాంగును నేనే పట్టుకుంటానని కూడా చెప్పారు. అప్పటివరకు వేణు స్వామి దంపతులు భయపడకుండా ఉండాలని కోరారు. ఆత్మహత్య అస్సలు చేసుకోకూడదని పేర్కొన్నారు.