అప్పటివరకు.. ఎన్టీఆర్ అంటే ఎవరో తెలియదన్న వివాదాల డైరెక్టర్..!!

-

ఆర్జీవి ప్రస్తుతం ఇండస్ట్రీల ఈయన మాట్లాడే మాటలు చాలా హాట్ టాపిక్గా మారుతుంటాయి. ఈయన మాటలే కాకుండా తీసే సినిమాలు కూడా ఎప్పుడు బోల్డుగానే ఉంటాయని చెప్పవచ్చు. తాజాగా ఆర్జీవి ఇంటర్వ్యూ లో పాల్గొంటూ ఆసక్తికరమైన విషయాలను తెలియచేయడం జరిగింది. కొండ సినిమా విడుదల సమయంలో ఆర్జీవి ప్రమోషన్ పనులో పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అందులో తన చిన్నతనం నుండి సీనియర్ ఎన్టీఆర్ సినిమాలు చూశానని.. తను ఎక్కడా కూడా హీరోగా ఎన్టీఆర్ కనిపించలేదని తెలియజేశారు.సీనియర్ ఎన్టీఆర్ ఎంత గొప్ప నటుడు ప్రతి ఒక్కరికి ఇక ఆయన అటు రాజకీయంగా ఇటు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు అయితే ఆర్జివి తనను హీరోగా చూడలేదని తెలియజేశారు.. కాని మొదటిసారిగా అడవి రాముడు సినిమాలో ఎన్టీఆర్ ఒక హీరోలాగా కనిపించార ని అంతకుముందు ఎన్నో చిత్రాలలో నటించిన హీరోలా కనిపించలేదని తెలియజేశారు. ఇక బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ కూడా అలాగే చాలా సినిమాల తర్వాత హీరోగా పేరు పొందారు. 1975లో అమితాబ్ బచ్చన్ నటించిన పలు సినిమాలతో ఆయన హీరోగా చూడడం మొదలు పెట్టమని తెలియజేశారు. ఇక కొండ సినిమా హీరో ఆదిత్ తో ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆర్జీవి.. నానాపటేకర్ అబ్ థక్ చెప్ప సినిమాలు ఆయన నటన అదిత్ కు చాలా ఇష్టం అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత ఆర్జివి కావడం విశేషమని చెప్పవచ్చు.

ఇక ఆర్జివి ఇవే కాకుండా తాజాగా సాయి పల్లవి మీద కూడా స్పందించడం జరిగింది. ఇక అంతే కాకుండా రాష్ట్రపతి అయిన ద్రౌపది పైన కూడా పలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో చాలా ట్రెండీగా అవుతున్నాడు వర్మ. ఇక ఈయనకు రివర్స్ అకౌంటబుల్ గా ప్రతి ఒక్కరు కూడా కౌంటర్ వేస్తూనే ఉన్నారు. అయితే ఇవన్నీ పట్టించుకోని వర్మ తనదైన శైలిలోనే స్పందిస్తూ ఉంటాడు అని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version