నాకు మద్దతు ఇవ్వండి.. మోదీకి యశ్వంత్ సిన్హా ఫోన్

-

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ యశ్వంత్ సిన్హా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జేఎంఎం నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ లకు ఫోన్ చేశారు. నిజానికి తన సొంత రాష్ట్రం జార్ఖండ్ లో శుక్రవారం నుంచి ప్రచారాన్ని ప్రారంభించాలని సిన్హా భావించారు.

అయితే సంతాల్ గిరిజన తెగకు చెందిన ముర్ము కు మద్దతు ఇవ్వాలన్న ఆలోచనలో సొరెన్ ( ఆయనది అదే తెగ) ఉన్నట్లు గమనించిన యశ్వంత్.. ప్రచారాన్ని వాయిదా వేసుకున్నారు. జెడిఎస్ కూడా ముర్ము కు మద్దతు తెలిపే అవకాశం కనిపిస్తోంది. సమాజ్వాదీ పార్టీ యశ్వంత్ సిన్హా కి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. యశ్వంత్ సిన్హా ఈ నెల 27న ఆయన నామినేషన్ దాఖలు చేస్తారని భావిస్తున్నారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల రాజధానుల్లో పర్యటించి ఓట్లు అభ్యర్థించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version