నాయ‌కులంతా రైతుల్లా మారాలి.. పూరి జ‌గ‌న్నాథ్ హాట్ కామెంట్స్‌

-

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. లాక్‌డౌన్ నేప‌థ్యంలో సినిమాల‌కు కాస్త విరామం ఇచ్చిన ఆయ‌న తాజాగా `పూరీ మ్యూజింగ్స్` పేరుతో వివిధ అం శాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాల గురించి మాట్లాడిన పూరీ.. తాజాగా `వెర్టికల్ ఫార్మింగ్` గురించి చాలా ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. `ఏడు వేల సంవత్సరాల క్రితమే మనం వ్యవసాయం నేర్చుకున్నాం. ఎన్నో పద్ధతుల్లో పంటలు పండిస్తున్నాం. ఇప్పుడున్న లేటెస్ట్ పద్ధతి `వెర్టికల్ ఫార్మింగ్`. ఈ పద్ధతిలో రోజూ మనకు కావాల్సిన కూరగాయలను మనమే పండించుకోవచ్చు.

దీనికి ఎకరాల ఎకరాల భూమి అవసరం లేదు. మీ టెర్రస్ మీద, బాల్కనీలో, పార్కింగ్ ఏరియాలో కూడా పండించుకోవచ్చు. ప్రతి ఒక్కరూ వ్యవసాయం మీద దృష్టి సారించాలని, తమ వంట గది పక్కనే స్వయంగా కూరగాయలను పండించుకోవాలి అని దర్శకుడు పూరీ జగన్నాథ్ సూచించారు. బయట పొలంలో 100 లీటర్ల నీరు కావాల్సి వస్తే.. ఈ పద్ధతిలో 5 లీటర్ల నీరు చాలు. పురుగుల మందులు వాడకుండా మనమే పెంచుకోవచ్చు. 2 ఎకరాల్లో పండించే కూరగాయలను ఈ పద్ధతి ద్వారా 2 వందల గజాల్లో పండించొచ్చు. అదీ ఆరోగ్యకరంగా, రసాయనాలు వాడకుండా పెంచవచ్చు అని సూచించారు. `వెర్టికల్ ఫార్మింగ్`పై ప్రభుత్వం దృష్టి సారించాల‌ని, ప్రతి గ్రామంలోనూ `వెర్టికల్ ఫార్మింగ్`ను ప్రోత్సహించాల‌ని కోరారు. అంతేగాక నాయకులందరూ తలపాగా చుట్టి రైతన్నల్లా మారాల`ని పూరీ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news