రామ్ పోతినేని చిత్రం లో పాట కోసం అన్ని కోట్ల తీసుకుంటున్న ఊర్వశి రౌతేల..?

-

బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అగ్ర కథానాయకులలో ఊర్వశి రౌతేల కూడా ఒకరు.. ముఖ్యంగా ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ లలో నటించి మంచి క్రేజీ ను సంపాదించుకుంది. దీంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయదు. 2015 లో మిస్ యూనివర్సిటీ పోటీలలో పాల్గొన్న ఊర్వశి రౌతేల.. క్రికెటర్ రిషబ్ పంత్ తో ఎప్పుడు తరచూ వార్తలలో నిలుస్తూ ఉంటుంది.

ఊర్వశి రౌతేల తన అందంతో నటనతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను కూడా ఇటీవల కాలంలో అలరిస్తూనే ఉంది.చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో స్పెషల్ సాంగ్లు కనిపించింది. రీసెంట్గా అఖిల్ నటించిన ఏజెంట్ చిత్రంలోని స్పెషల్ సాంగ్ లో కూడా అలరించింది. ఇప్పుడు తాజాగా హీరో రామ్ పోతినేని నటిస్తున్న చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో రామ్ పోతినేని నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

రామ్ సరసన హీరోయిన్గా శ్రీ లీల నటిస్తున్నది. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి రౌతేల ను సంప్రదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం ఈమెకు రూ .3 కోట్ల రూపాయల కూడా ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.సోషల్ మీడియాలో తరచు ఈ ముద్దుగుమ్మ వీడియోలు ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులకు హాట్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మరి ఈ విషయంపై అధికారికంగా చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news