Konda polam Review: వైష్ణవ్ తేజ్ ‘కొండ పొలం’ రివ్యూ అండ్ రేటింగ్

-

Konda Polam Review: మెగా వారి మేన‌ల్లుడుగా చిత్రసీమ‌లో అడుగుపెట్టి.. ఉప్పెన మూవీ తో బ్లాక్ బ్లాస‌ర్ హిట్ కొట్టాడు వైష్ణవి తేజ్. దీంతో మామ‌కు ద‌గ్గ అల్లుడి అనిపించుకున్నాడు. భారీ మొత్తంలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. తొలి విజ‌యం అందించిన జోష్‌తో తర్వాత ఆయ‌న న‌టించిన సినిమా కొండ పొలం. ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవలను క్రిష్ జాగర్లమూడి అదే పేరుతో వెండితెరకెక్కించారు. వై రాజు రెడ్డి, జే సాయిబాబు లు నిర్మిస్తున్నారు. వైష్ణవ్ సరసన అందాల తార రకుల్ ప్రీతి సింగ్ జంటగా నటిస్తోంది. కొండ పొలం అనే చిత్రం అక్టోబర్ 8న వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్షకుల మందుకు వచ్చింది.

Konda Polam Review
Konda Polam Review

 

అయితే.. నవల ఆధారంగా డైరెక్ట‌ర్ క్రిష్ ఈ చిత్రాన్ని తెర‌కెక్క‌డం, ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం గ్రామీణ , అడ‌వి ప్రాంతంలో చిత్రీకరించ‌డం, అలాగే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్, టైల‌ర్స్‌, లిరిక‌ల్ సాంగ్స్ కు ప్రేక్ష‌కుల నుంచి అనూష్య స్పంద‌న వ‌చ్చింది. దీంతో కొండపొలం చిత్రంపై చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా అదిరిపోయే అంచనాలు క్రియేటయ్యాయి. మరి కొండపొలం చిత్రం ప్రేక్షకుల అంచనాలు ఏమేర అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

సినిమా: కొండపొలం
దర్శకత్వం: క్రిష్
నిర్మాతలు: సాయి బాబు జాగర్లమూడి, రామి రెడ్డి
సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్
సంగీతం: ఎంఎం కీరవాణి
నటీనటులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, తదితరులు
రిలీజ్ డేట్: 08-10-2021

కథ:

నల్లమల అడవీప్రాంతానికి చెందిన కటారు రవీంద్ర యాదవ్(వైష్ణవ్ తేజ్)అనే కుర్రాడి కథ ఇది. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ లో పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా అతడు వరుసగా రిజెక్ట్ అవుతూ వస్తాడు. నగరంలో బతకలేక తన పల్లెకు వెళ్ళిపోతాడు. కానీ వైష్ణ‌వ్ ఊరిలో ప్ర‌జ‌లు తీవ్ర కరువుతో అల్లల్లాడుతుంటారు. ఈ స‌మ‌యంలో తాత రోశయ్య (కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు.
తన తండ్రి(సాయి చంద్)తో కలిసి తన కుటుంబానికి ఆసరాగా ఉంటూ గొర్రెల మందతో ‘కొండపొలం’ చేయ‌మ‌ని చెప్పాడు. త‌న తాత స‌ల‌హా మేరకు త‌మ‌ మేకల మంద‌ను కొండపొలం వద్దకు తీసుకొస్తాడు.
నెల రోజుల పాటు అడవితో సహజీవనం చేయాల్సివ‌స్తుంది. ఈ క్రమంలో అతడికి అడవిలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అడవి అతనికి ఏ యే పాఠాలు నేర్పింది? ఎదురైన కష్టాలను ఎదుర్కొని అతను ఎలా విజయపథంలో సాగాడన్నదే ఈ చిత్ర కథ.

విశ్లేషణ:
క్రిష్ ద‌ర్శ‌క‌త్వం గురించి కొత్త‌గా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఆయ‌న చిత్రాన్ని ఎలా తెర‌కెక్కిస్తాడో అంద‌రికీ తెలుసు. నవల ఆధారంగా తెర‌కెక్కిన చిత్ర‌మైనా .. త‌న మార్కును మాత్రం ఎక్క‌డ మిస్ కాలేద‌నే చెప్పాలి. రాయ‌ల‌సీమ నేప‌థ్యంలో సాగే క‌థ అనగానే..మనకు వెంట‌నే గుర్తొచ్చేవి ఫ్యాక్షన్ సీన్స్‌, ఫైట్స్‌, హత్యల నేపథ్యంలో సాగే సినిమాలే గుర్తుకు వ‌స్తాయి. కానీ ఆ ధోర‌ణిని పూర్తిగా మార్చేశాడు క్రిష్ .అయితే అక్కడి మనుషుల్లోనూ మానవత్వం ఉంటుందని, వాళ్లు పెంచుకునే పశువుల‌కు ఏదైనా హాని జ‌రిగితే.. ప్రాణాలను సైతం పణంగా పెట్టి కాపాడుతార‌ని చూపించారు క్రిష్. అక్క‌డి ఆహార వ్యవహారాలు, మాట తీరూ చాలా బాగుంది. ప్ర‌తి పాత్రకు ప్రాణం పోశాడు. అడవితో మనిషికి ఉండాల్సిన బంధాన్ని, పశువులకు మనుషులకు మధ్య ఉండే అనుబంధాన్ని చాలా చక్కగా తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి.

సినిమా కథనం:

రవీంద్ర యాదవ్(వైష్ణవ్ తేజ) రాయ‌ల‌సీమ‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన వ్య‌క్తి.. బి.టెక్ పూర్తి చేసి.. పట్నంలో ఇంటర్వ్యూల్లో వరుసగా రిజెక్ట్ అవుతూ వస్తాడు. దీంతో విసుగు చెందిన అతడు తిరిగి తన ఊరికి వచ్చేస్తాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న ప‌ల్లెలో క‌రువు తాడ‌వం చేస్తుంది. ఆ ఊరిలోని మేకల మందలను వేరే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతారు అక్కడి జనం.

ఈ క్రమంలో తన తాత సూచన మేరకు కొండపొలం వెళ్తాడు. కొండపొలం వెళ్లే క్ర‌మంలో .. వారికి అనేక సమస్యలు ఎదురవుతాయి. మేకల మందలోని ఒక్కో మేకను పెద్దపులి చంపేస్తూ ఉంటుంది. అడ‌వి దొంగ‌లు కూడా ప‌శువుల‌ను దొంగ‌లించే ప్ర‌య‌త్నం.. క‌ల‌ప అక్ర‌మం రవాణా ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ దగ్గర ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది.

ఇక సెకండాఫ్‌లో.. పెద్ద పులి నుండి గొర్రెలను కాపాడటానికి ర‌వీంద్ర చేసే ప్రయత్నం రోమాంచితంగా ఉంటుంది. పశువులను తమ సొంత బిడ్డలుగా భావించే రైతు వాటికి తగిన గ్రాసం అందించలేక, కనీసం దాహం తీర్చలేక ఎంత మధనపడతాడో హ‌ర్ట్ కి ట‌చ్ అయ్యేలా తెర‌కెక్కించాడు క్రిష్‌. ఇక రవీంద్రను ప్రేమించే వ్య‌క్తి ఓబులమ్మ(రకుల్ ప్రీత్ సింగ్). అడవిలో అతడికి ఎదురయ్యే స‌మ‌స్య‌లను ఎలా ఎదిరించాలి. వారి ప‌రిచ‌యం.. ప్రేమ‌.. చాలా చక్కగా చూపించారు. ఓవరాల్‌గా కొండపొలం.. స‌గ‌టు ప్రేక్ష‌కుడిని మెప్పించడంలో డైరెక్ట‌ర్ క్రిష్ పూర్తిగా సక్సెస్ అయ్యిందని చెప్పాలి.

వైష్ణవ్ తేజ్ కొండ పొలం | Konda Polam
వైష్ణవ్ తేజ్ కొండ పొలం | Konda Polam

నటీనటులు పర్ఫార్మెన్స్:

మెగా హీరో వైష్ణవ్ తేజ కళ్ళలో ఏదో ఆకర్షణ ఉంది. చాలా భావాలను ఆ కళ్లే పలికిస్తాయి. కటారు రవీంద్ర యాదవ్ అనే పాత్రలో అతను చక్కగా ఒదిగిపోయాడు. ఉప్పెన తరువాత ఈ యంగ్ హీరో చాలా మెచ్యూరిటీ క‌నిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో వైష్ణవ్ న‌ట‌న అంద‌రిని ఆకట్టుకుంటుంది. మ‌రో పాత్ర ఓబులమ్మ.. ఈ పాత్ర‌లో రకుల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది.

పిరికి వాడైన రవీంద్రను ఆట పట్టించడం, అతనిలో ఓ పట్టుదల, ధైర్యాన్ని మేల్కొలపడం ఓబులమ్మ పాత్ర ఈ పాత్ర‌లోర‌కూల్ ఒడిగిపోయింది. కథను రక్తి కట్టించింది. అలాగే.. రవీంద్రకు దిశానిర్దేశం చేసే పాత్రలో కోట శ్రీ‌నివాస్ రావు న‌ట‌న అద్భుతం. ఆయనకు రాసిన సంభాషణలు బాగున్నాయి. ర‌వింద్ర తండ్రి గురప్ప .. ఈ పాత్రలో సాయిచంద్ న‌టించి, మెప్పించారు.

వైష్ణవ్ తో పాటు అడవిలోకి వెళ్ళే పాత్రలలో అంథోని, హేమ, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి, అశోక్ వర్థన్ నటించారు. పోలీస్ అంకయ్య పాత్రలో రవి ప్రకాశ్ పోషించాడు. త‌న‌దైనా న‌ట‌న‌, హావభావాలతో ఆ పాత్ర‌ను రక్తి కట్టించాడు ర‌వి ప్ర‌కాశ్‌. రచ్చ రవి, అశోక్ వర్థన్ ల కామెడీ బాగుంది. అన్నపూర్ణమ్మ, నాజర్, లోకి, శ్యామల, సుభాషిణి లు ఇత‌ర పాత్ర‌లో క‌నిపించారు. దర్శకుడు క్రిష్‌, నిర్మాతలో ఒకరైనా రాజీవ్ రెడ్డి కూడా ఓ అతిథి పాత్రల్లో మెరిశారు

టెక్నికల్ పర్ఫార్మెన్స్:

సన్నపురెడ్డికి అందించిన‌ కథ, మాటలు ప్రేక్ష‌కుల గుండెల‌కు తాట‌కాయి. ప్ర‌తి డైలాగ్ ఆలోచింప చేస్తాయి. ప్ర‌తి సంభాషణ కూడా చాలా బాగుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అదుర్స్‌. ఇక అడ‌వి అందాల‌ను చిత్రీక‌రించ‌డంలో జ్ఞానశేఖర్ కెమెరా పనితనం కేక‌. సీతారామశాస్త్రి రాసిన పాటలు ఉత్తేజం, ఉద్వేగాన్ని కలిగించ‌గా.. చంద్రబోస్ సాహిత్యంలో అడవి అందాలను, దానితో మనిషికి ఉండే బంధాలను తెలియ‌జేసే ప్ర‌య‌త్నం చేశాడు.

అయితే.. ఫ‌స్టాఫ్ లో సాగినంత వేగంగా కథ.. సెకండాఫ్‌లో సాగలేదు. కొన్నిచోట్ల గ్రాఫ్ కాస్తంత కిందకు దిగింది. అలాగే ఎడిటింగ్ విష‌యంలో శ్రవణ్ కటికనేని కాస్తంత శ్రద్ధ చూపి ఉండాల్సింది. డైరెక్ట‌ర్ క్రిష్ తెరకెక్కించే సినిమాలు ఎందుకు ప్రత్యేకంగా ఉంటాయో మరోసారి కొండపొలం చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఓ నవల ఆధారంగా తెరకెక్కిచిన ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకోవడంతో క్రిష్ డైరెక్ష‌న్ అదుర్స్. ఓవ‌రాల్ గా.. కమర్షియల్ గా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందనేది పక్కన పెడితే, ఓ మంచి సినిమాను చూసిన అనుభూతిని అయితే ప్రేక్షకులకు అందిస్తుంది.

రేటింగ్: 4.0/5.0

Read more RELATED
Recommended to you

Latest news