తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమైన హై కోర్టు ఓ అత్యాచారం కేసు లో సంచలన తీర్పు ఇచ్చింది. అత్యాచారంతో బాలిక దాల్చిన గర్భం తొలగింపున కు అనుమతి ఇచ్చింది తెలంగాణ హై కోర్టు. 16 సంవత్సరాల బాలిక 26 వారాల పిండాన్ని తొలగించాలని కోఠి ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ ను తెలంగాణ హై కోర్టు ఆదేశించింది.
నిపుణులతో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని న్యాయస్థానం సూచనలు చేసింది. మొదట బాలికకు అబార్షన్ చేసేందుకు కోఠి ఆస్పత్రి నిరాకరించడం తో ఆమె తల్లి హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. గురువారం విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించార పిండం హక్కుల కన్నా అత్యాచార బాధితురాలి హక్కులే ముఖ్యమని న్యాయమూర్తి స్పష్టం చేసింది. చట్టాన్ని అనుసరించి అవాంఛనీయ గర్భం వద్దనుకునే హక్కు ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. ఇక ఈ కేసులో తెలంగాణ హై కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బాధిత కుటుంబం తో పాటు.. ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.