వకీల్ సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలా రోజులు తర్వాత రీఎంట్రీ ఇవ్వనున్న సినిమా వకీల్ సాబ్. ఈ  చిత్రంపై పవన్ కల్యాణ్ అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్రేజ్ ఉంది. రీసెంట్ గా విడుదలైన ఈ చిత్ర పోస్టర్ సినమా పై అంచనాలను పెంచేయడంతో పాటు పవన్ అభిమానులకు ఐఫీస్ట్ ను అందించింది. అంతేకాకుండా ఈ పోస్టర్ ట్విట్టర్ లో అనేక రికార్డులను సెట్ చేసింది. ఉమెన్స్ డే సందర్బంగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను నేడు విడుదల చేశారు…

రీసెంట్ గా సామజవరగమనతో హిట్ అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వకీల్ సాబ్ చిత్రానికి కూడా సంగీతం అందిస్తున్నాడు. పవన్ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మగువా మగువా అంటూ సాగే ఈ పాటలో స్త్రీ యొక్క గొప్ప తనాన్ని చక్కగా వివరించారు.

దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా బాలివుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ రీమేక్ గా తెరకెక్కుతోంది. MCA చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news