ఇద్ద‌రు హీరోల‌ను టెన్ష‌న్ పెడుతోన్న మెగా హీరో

-

టాలీవుడ్‌లో మెగా హీరోల సినిమా రిలీజవుతుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయో…. మెగా ఫ్యామిలీ అభిమానుల హడావుడి ఎలా ? ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ శుక్ర‌వారం థియేటర్లలోకి రాబోతున్న మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్ వాల్మీకి సినిమాపై ఇండస్ట్రీ వర్గాలను… ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఇదే టైంలో వరుణ్ తేజ్ సినిమా ఇద్దరు స్టార్ హీరోలను టెన్షన్ పెడుతోంది.

నేచుర‌ల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా మిక్స్‌డ్ టాక్‌తో కూడా ఓ మోస్త‌రు వసూళ్లతో దూసుకుపోతోంది. రు. 29 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన గ్యాంగ్ లీడర్ ఇప్ప‌టి వ‌ర‌కు రూ.14 కోట్లు రాబ‌ట్టింది. క‌లెక్ష‌న్లు బాగా డ్రాప్ అయ్యాయి. మ‌రో రూ.15 కోట్లు రాబ‌ట్టాలి. మ‌రో రెండు రోజుల టైం మాత్ర‌మే ఉంది. వ‌చ్చే శుక్ర‌వారం వాల్మీకితో పాటు సూర్య డ‌బ్బింగ్ మూవీ బందోబ‌స్త్ కూడా వ‌స్తోంది.

గ్యాంగ్ లీడ‌ర్‌ ప్రాజెక్ట్ సేఫ్ అవ్వాలంటే మరో రు. 15 కోట్లు రాబట్టాల్సి ఉంది. మరి వాల్మీకి మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది. ఈ రెండు మూడు రోజుల్లో నాని ఎంతవరకు సేఫ్ అవుతాడో చూడాలి. వాల్మీకికి హిట్ టాక్ వ‌స్తే గ్యాంగ్ లీడ‌ర్‌కు దెబ్బ త‌ప్ప‌దు. ఇక తెలుగులో కొద్ది రోజులుగా వ‌రుస ప్లాపుల‌తో స‌రైన మార్కెట్ లేక ఇబ్బంది ప‌డుతోన్న సూర్య బందోబ‌స్త్ సినిమాతో వాల్మీకి సినిమాకు పోటీగా వ‌స్తున్నాడు.

valmiki movie grand release september 20
valmiki movie grand release september 20

సూర్య‌కు సైతం వాల్మీకి నుంచి గ‌ట్టి పోటీ ఉంది. బందోబ‌స్త్ భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది… కెవి.ఆనంద్ డైరెక్ష‌న్ కావ‌డంతో మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి వాల్మీకి ప్ర‌భావం బందోబ‌స్త్ మీద ఎంత వ‌ర‌కు ప‌డుతుందో ? అని ఆ సినిమా యూనిట్ సైతం టెన్ష‌న్‌లోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news