ఏపీలో ఫ్యాన్ గాలి కోసం సీనియ‌ర్ నేత టి.సుబ్బిరామిరెడ్డి ఆరాటం..!

-

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దశాబ్దాలుగా ఆ పార్టీతో అనుబంధం ఉన్న రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఫ్యాన్ గాలి కోసం ఆరాటపడుతున్నారు అన్న ప్రచారం ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్బిరామిరెడ్డి మూడు దశాబ్దాల క్రితమే విశాఖ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ రాజకీయాల్లో సుబ్బిరామిరెడ్డిది చెరగని ముద్ర. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండుసార్లు ఆయన విశాఖ ఎంపీగా గెలిచారు. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శిష్యుడుగా… ఆమె అనుచరుడుగా ఉన్న ఆయన ప్రతిష్టాత్మకమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా అప్పట్లో జాతీయ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి ముగియనుంది. ఆ తర్వాత ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మార‌నుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక్‌స‌భ ఎన్నికల్లో పోటీ చేయాలన్న వచ్చే ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవు. సుబ్బిరామిరెడ్డికి జగన్‌కు మంచి అనుబంధం ఉంది. వారిద్దరిని అనుసంధానం చేయడానికి విశాఖ శారదా పీఠం స్వామీజీ ఉండనే ఉన్నారు. సుబ్బిరామిరెడ్డి వైసీపీలో చేరితే రాజ్యసభ సీటు గ్యారంటీ అంటున్నారు విశ్లేషకులు.

త్వరలో జరిగే గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని వైసిపి ఇప్పటినుంచే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతుంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలో ఉన్న నాలుగు అసెంబ్లీ సీట్లలో టిడిపి విజయం సాధించింది. ఈ క్రమంలోనే విశాఖ సిటీలో ప‌ట్టున్న సుబ్బిరామిరెడ్డిని తమ పార్టీలో చేర్చుకుంటే తమకు కూడా క‌లిసి వ‌స్తుంద‌ని వైసిపి వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో సుబ్బిరామిరెడ్డి కొద్ది రోజులుగా వైసీపీ నాయకులతో కూడా తెలుస్తోంది. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున హంగామా చేశారు. ఈ పరిణామాలన్నీ ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ గా ఉన్నార‌న్న సంకేతాలు ఇస్తున్నాయి.

దేశంలో కాంగ్రెస్ రోజు రోజుకు ప‌ట్టు కోల్పోతోంది. ఇక ఏపీలో ఆ పార్టీ గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటూ అంత‌మంచిది. మ‌రి ఈ నేప‌థ్యంలో సుబ్బిరామ‌రెడ్డి మ‌రి కొద్ది రోజులు రాజ‌కీయంగా యాక్టివ్‌గా ఉండాల‌న్నా ? ఏదో ఒక ప‌ద‌విలో ఉండాల‌న్నా ఆయ‌న‌కు వైసీపీ మంచి ఆప్ష‌న్ అంటున్నారు. మ‌రి ఆయ‌న ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news