వామ్మో తారకరత్న ప్రేమ , పెళ్లి లో ఇన్ని ట్విస్ట్ లా..?

-

నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు . గత శుక్రవారం కుప్పంలో టీడీపీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్రకి హాజరైన తారకరత్న కొద్దిసేపు నడవగానే తీవ్ర అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే దగ్గర్లో ఉన్న హాస్పిటల్ కి తరలించగా వైద్యులు గుండెపోటు వచ్చిందని నిర్ధారించారు. మెరుగైన చికిత్స కోసం ఆయన భార్య అలేఖ్య రెడ్డి కోరిక మేరకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి అదే రోజు రాత్రి తరలించడం జరిగింది. ఇక ఆ రోజు నుంచి ఇప్పటివరకు తారకరత్న చికిత్స ఏర్పాట్లను వారి కుటుంబ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

తారకరత్న వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి . పెద్దల్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. అలేఖ్య రెడ్డి మాట్లాడుతూ.. చెన్నైలో మా సిస్టర్ కి స్కూల్లో తారకరత్న సీనియర్.. ఆ తర్వాత ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మేము హైదరాబాదులో కలిసాము. వాస్తవానికి మొదటి నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాము . కానీ ఆ తర్వాత తారకరత్న ప్రపోజ్ చేశారు. దాంతో నేను మా పేరెంట్స్ తో మాట్లాడాను . కానీ వాళ్ళు ఒప్పుకోలేదు.. కారణం సినిమా ఇండస్ట్రీపై వారికి మంచి అభిప్రాయం లేకపోవడమే.. అటు నందమూరి ఫ్యామిలీ వారు కూడా పెళ్లికి ఒప్పుకోలేదు.. అందుకు కారణం నేను అప్పటికే పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్నాను.. నేను కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు.

ఆ సమయంలో మా మామ విజయ్ సాయి రెడ్డి మద్దతుగా నిలవగా 2012 ఆగస్టు 2వ తేదీన హైదరాబాద్లోని సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నాము. ఈ వివాహానికి ఎవరు కూడా రాలేదు. అని గుర్తు చేసుకున్నారు. 2013లో ఈ జంటకు నిష్కా అనే పాప జన్మించింది. ఇకపోతే వివాహం జరిగిన తర్వాత చాలా సంవత్సరాల పాటు వీరు తమ కుటుంబాలకు ఒంటరిగా జీవించాల్సి వచ్చింది. కానీ నాలుగేళ్ల తర్వాత తారకరత్న బర్త్ డే సందర్భంగా అందరూ కలిసినట్లు అలేఖ్య రెడ్డి గుర్తు చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version