Varisu : సంక్రాంతి బరిలో “వారసుడు”

-

విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ క్రమంలోని ఈ సినిమా కోసం విజయ్ దాదాపుగా రూ.100 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది.


తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే దీపావళికి ఈ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా అనే ఆసక్తి అభిమానులలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ వారసుడు సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతి అని చెప్పింది కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ఫైనల్ చేయలేదు. ఈ మేరకు విజయ్ స్టైలిష్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రం బృందం. ఈ పోస్టర్లో ఓ బలిష్టమైన సుత్తితో విజయ్ కనిపించాడు. ఇక ఈ అప్డేట్ తో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version