అందరికీ అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా : మంత్రి హరీశ్‌రావు

-

ప్రజలందరికి మంత్రి హరీశ్‌ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అందరికి అన్నింటా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని ట్వీట్‌ చేశారు.

‘చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి. లక్ష్మీ నారాయణుని అనుగ్రహముతో అందరికి అన్నింటా శుభం జరగాలి. ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.’ అని ట్విట్టర్‌ వేదికగా మంత్రి హరీశ్‌ రావు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

 

దీపావళి పండుగ సందర్భంగా ప్రజలందరికీ మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకొంటున్న ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.

‘దీపావళి పండుగ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ.. మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version