ఎఫ్‌-3లో హైలెట్ కానున్న వ‌రుణ్‌తేజ్‌.. డైరెక్ట‌ర్ మాస్ట‌ర్ స్కెచ్‌

-

ఎఫ్-2 సినిమా ఎన్ని న‌వ్వులు పూయించిందో అంద‌రికీ తెలిసిందే. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్గా తెర‌కెక్కిన ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టింది. దాదాపు రూ.80కోట్లు వ‌సూలు చేసింది. ఇందులో వెంకటేశ్‌, వ‌రుణ్‌తేజ్, త‌మ‌న్నా, మెహ్రీన్‌కౌర్ న‌టించ‌డంతో అన్ని హంగులు క‌లిసొచ్చాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ఎఫ్‌-3సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి.

ఎఫ్‌-2లో న‌టించిన వాళ్లే ఇందులోనూ న‌టిస్తున్నారు. అయితే ఎఫ్‌-2 వెంక‌టేశ్ పాత్ర‌కే ఎక్కువ సీన్లు ఉన్నాయి. దీంతో ఇప్పుడు వ‌రుణ్‌తేజ్‌పై డైరెక్ట‌ర్ దృష్టి పెట్టార‌ని తెలుస్తోంది.

ఇప్పుడు వ‌స్తున్న ఎఫ్‌-3లో మాత్రం వ‌రుణ్ తేజ్‌కే ఎక్కువ సీన్లు ఉండ‌నున్నాయి. ఆయ‌న కామెడీ టైమింగ్ ఈ సినిమాలో హైలెట్‌గా నిలుస్తుంద‌ని స‌మాచారం. మ‌రి మెగా హీరోను హైలెట్ చేస్తే వెంకీ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఏదేమైనా డైరెక్ట‌ర్ ఇద్ద‌రు హీరోల‌కు న్యాయం చేశాడ‌ని అంతా అనుకుంటున్నారు. మ‌రి ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news