పోస్టల్ అదిరే పాలసీ… రూ.5 వేలతో రూ.7 లక్షల వరకు పొందొచ్చు..!

-

పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ వున్నాయి. వీటి వలన ఎన్నో రకాల బెనిఫిట్స్ ని ఎందరో పొందుతున్నారు. అదే విధంగా గ్రామ్ ప్రియా స్కీమ్ వలన కూడా చాల లాభాలు వున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

ఈ స్కీమ్ గడువు పదేళ్లు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్స్‌లో ఇది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. దీనిలో చేరితే తక్కువ ప్రీమియంతో అధిక రాబడి పొందొచ్చు. ఈ స్కీమ్ లో చేరడానికి కనీసం 20 ఏళ్ల వయసు ఉండాలి. గరిష్టంగా 45 ఏళ్ల వరకు వయసు కలిగిన వారు దీనిలో చేరవచ్చు.

ఈ పాలసీ టర్మ్ పదేళ్లు ఉంటుంది. కనీసం రూ.10 వేల మొత్తానికి పాలసీ తీసుకోవచ్చు. అదే విధంగా దీని వలన గరిష్టంగా రూ.10 లక్షల వరకు పొందొచ్చు. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే నామినీకి బీమా మొత్తంతోపాటు బోనస్ వంటివి కూడా లభిస్తాయి.

పాలసీ ప్రీమియం మొత్తం వయసు ప్రాతిపదికన మారుతుంది. దీనిలో మీరు రూ.5 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే నెలవారీ ప్రీమియం దాదాపు రూ.5 వేలు అవుతుంది. మీ చేతికి మొత్తంగా రూ.7.25 లక్షలు వస్తాయి.

అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్వెస్ట్‌మెంట్, ఇన్సూరెన్స్ స్కీమ్ ఇది. మనీ బ్యాక్ పాలసీ కూడా. నాలుగేళ్ల తర్వాత పాలసీ మొత్తంలో 20 శాతం మొత్తాన్ని పొందొచ్చు. 7 ఏళ్ల తర్వాత మరో 20 శాతం డబ్బులు తీసుకోవచ్చు. అదే పదేళ్ల తర్వాత అయితే మీరు 60 శాతం మొత్తం డబ్బులు తో పటు బోనస్ కూడా తీసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news