వెంకటేష్ ఇంట్లో పెళ్లి సందడి.. వియ్యంకుడు మాజి సిఎం స్నేహితుడే..!

-

దగ్గుబాటి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు అశ్రిత పెళ్లికి సిద్ధమైంది. ఇంతకీ వెంకటేష్ అల్లుడిగా రాబోతున్నది ఎవరు అంటే ప్రముఖ పారిశ్రామికవేత్త సురేందర్ రెడ్డి మనవడని తెలుస్తుంది. బేకరీ బిజినెస్ చేస్తున్న అశ్రిత ఇప్పటికే సిటీలో కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేసిందట. అశ్రిత ఎంగేజ్మెంట్ ఈరోజు కేవలం కుటుంబ సభ్యుల సమక్ష్యంలో జరిగిందని తెలుస్తుంది.

మార్చి 1న అశ్రిత పెళ్లి ఫిక్స్ చేశారట. వెంకటేష్ వియ్యంకుడు రఘురామి రెడ్డి మాజి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి స్నేహితుడని సమాచారం. ఈమధ్యనే ఎఫ్-2 తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ తర్వాత వెంకీ మామా టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు రియల్ లైఫ్ లో మామ అవుతున్నాడు. ఎంగేజ్మెంట్ కు సెలబ్రిటీస్ పెద్దగా రాలేదని తెలుస్తుండగా పెళ్లిని మాత్రం గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version