వాట్సప్‌వండర్‌బాక్స్: నమో నమో అంటున్న రాహుల్.. వైరల్ పిక్

-

రాహుల్ గాంధీ ఏంది.. నమో నమో అనడమేందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా? నిజమేనండోయ్.. రాహుల్ గాంధీ.. నమో అగేన్.. అంటూ రాసి ఉన్న టీషర్టు వేసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక.. నెటిజన్లు ఊరుకుంటారా? నమో నమో రాహుల్ గాంధీ.. రాహుల్ గాంధీ కూడా మరోసారి మోదీకే ప్రధాని పీఠం కట్టబెట్టాలంటున్నారు.. అంటూ తమకు తోచిన కామెంట్లను పెడుతున్నారు. ఇంతకీ.. ఆ టీషర్టును నిజంగా రాహుల్ వేసుకున్నారా? లేక.. అది ఫోటోషాప్ చేసిన ఫోటోనా? ఇలాంటి డౌట్లకు సమాధానం చెప్పాలంటే ఆ దేవుడే దిగిరావాలి. వాట్సప్ వండర్ బాక్స్ అనే హాష్‌టాగ్‌తో ట్విట్టర్‌లో షేర్ అయ్యే వాటిలో ఈ ఫోటో బాగా వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version