తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బడా నిర్మాత కుమారుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత వైవిధ్యమైన కథల ఎంపికలతో స్టార్ హీరోగా దూసుకుపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే సినిమాలు చేస్తూ అలరించిన ఈయన ఈ మధ్యకాలంలో తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఆయన ఆస్తుల వివరాలు వైరల్ గా మారుతున్నాయి.
టాప్ ప్రొడ్యూసర్ కొడుకు గా ఇండస్ట్రీ లోకి వచ్చిన వెంకటేష్ కు సుమారుగారూ. 2600 కోట్లకి పైగా ఆస్తులు కూడా పెట్టినట్లు సమాచారం. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులతో కలిపితే మరో రూ.2000 కోట్లు ఉంటాయట. అంతేకాదు వీటితోపాటు ఇల్లు, కార్లు ఇలా మొత్తం మీద ఈయనకు సుమారుగా రూ.5000కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఫిలిం స్టూడియోలో కూడా సగం వాటా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ ఆస్తుల వివరాలు తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇకపోతే ప్రస్తుతం ఈయన ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న విక్టరీ వెంకటేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు తెగ పోస్టులు చేస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కరోనా కారణంగా నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమాను నేరుగా ఓటీటీ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈరోజు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో సందడి చేస్తోంది.