సురేఖ వాణి ఇంట్లో పార్టీ చేసుకున్న నటీమణులు వీడియో వైరల్..!!

-

సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికీ ఈమె సోషల్ మీడియాలో తన హవా కొనసాగిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన కూతురుతో కలిసి వేసేటటువంటి డాన్సులు, ఫోటోలు సైతం కొన్ని మిలియన్ల వ్యూస్ ని రాబడుతూ ఉంటాయి. అలాగే వీరిద్దరి పైన ఎక్కువగా ట్రోల్స్ కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో సురేఖవాణికి మాత్రం మంచి క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

ఇప్పుడు తాజాగా మరొక డాన్స్ వీడియోను సురేఖ వాణి షేర్ చేసింది. ఇందులో మాత్రం తన కూతురు లేదు ఆమె స్థానంలో కొంతమంది కోఆర్టిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది.. అందులో ముఖ్యంగా హేమ, సన బిగ్ బాస్ ప్రియా ఇలా మొత్తం 12 మంది సీనియర్ నటిమనులు సురేఖ వాణి ఇంట్లో కలసి గెట్ టుగెదర్ పార్టీని ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. అందరూ కలిసి ఇలా సరదాగా దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.ఉషారుగా డాన్స్ వేస్తున్నటువంటి వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ముఖ్యంగా రారా రక్కమ్మ అనే సాంగ్కు అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ నటిమనులు. ఈ వీడియోని స్వయంగా సురేఖ వాణి తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇలా చాలా రోజుల తర్వాత అందరిని ఒకేసారి సీనియర్ నటి మనులను చూడడంతో నేటిజెన్లు చాలా ఫుల్ ఖుషి అవుతున్నారు. వీరి ఫోటోలు వీడియోలు చూస్తూ తెగ లైకులు కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం ఈ ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)

Read more RELATED
Recommended to you

Latest news