సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తన బాయ్ ఫ్రెండ్ ప్రముఖ దర్శకుడు విగ్నేష్ శివన్ సుమారు ఏడు సంవత్సరాల పాటు ప్రేమించి జూన్ 9వ తేదీన ఎట్టకేలకు షెరటాన్ పార్క్ గ్రాండ్ హోటల్ మహాబలిపురంలో వివాహం చేసుకుంది. ఇక వీరి వివాహానికి అత్యంత సన్నిహితులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. ఇకపోతే వీరిద్దరూ సుదీర్ఘకాలం పాటు ప్రేమించుకొని వివాహం చేసుకోవడంతో ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
ఇకపోతే ప్రస్తుతం తమ విలువైన సమయాన్ని గడపడానికి వీరిద్దరూ కూడా కేరళ లోని కొచ్చిన్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేరళ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చి అభిమానులకు ఆశ్చర్యాన్ని అలాగే సంతోషాన్ని కలిగించారు. ఇద్దరు కూడా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండి.. తమ విలువైన సమయాన్ని.. నయనతార తల్లిదండ్రులతో కలసి ఎంజాయ్ చేయడానికి కొచ్చిన్ కి వెళ్తున్నట్లు సమాచారం. ఇక నిన్న అనగా జూన్ 12వ తేదీన ఈ దంపతులిద్దరూ కొచ్చిన్ లో కొన్ని రోజులపాటు సమయాన్ని గడపడానికి వెళ్తున్నట్లు సమాచారం. అలాగే అక్కడే తమ హనీమూన్ ని కూడా పూర్తి చేసుకొని తిరిగి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా అందుతున్న మరొక సమాచారం ప్రకారం నయనతార , విఘ్నేష్ శివన్ మరొకసారి వివాహం చేసుకోబోతున్నారు. ఇందుకు కారణం అనారోగ్యం కారణంగా హాజరు కాలేదు. నిజానికి నయన తార తల్లిదండ్రులు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వీరి పెళ్లికి హాజరు కాలేదు. అందుకే చెన్నైలో తమ తల్లిదండ్రులు మరొకసారి వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే నిజమైతే ఈ దంపతులిద్దరూ మరోసారి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇకపోతే వీరి వివాహ వేడుకలు నెట్ ఫ్లెక్స్ వేదికగా మనం చూడవచ్చు. ఎప్పటి నుంచి ప్రచారం చేస్తారు అనే విషయం మాత్రం ఇంకా బయటికి తెలియకపోవడం గమనార్హం .