నా పేరు ముందు ‘ది’ అందుకే : విజయ్ దేవరకొండ

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ .. స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్​ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్‌ 1న థియేటరల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ట్రైలర్​ను రిలీజ్​ చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది.

ఈ ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగానే తన పేరు ముందు ది అని పెట్టడం గురించి.. అలాగే సోషల్ మీడియాలో అనసూయతో గొడవ గురించి స్పందించారు. ఇంతకీ విజయ్ ఏం చెప్పారంటే..?

‘లైగర్‌ సమయంలో పూరీ జగన్నాథ్​ నాకు రెండు మూడు టైటిల్స్‌ చెప్పారు. ఆ టైటిల్స్‌తో నాకు అవసరం లేదని చెప్పాను. నా పేరు నాకు సరిపోతుందని చెప్పాను. కావాలంటే ‘ది విజయ్‌ దేవరకొండ’ వాడుకోవమని సలహా ఇచ్చాను. ఇకపోతే సోషల్‌ మీడియలో అనసూయతో గొడవలు ఏం జరుగుతున్నాయో నాకైతే తెలీదు. గొడవపడే వాళ్లనే అడగండి’ అని విజయ్ చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news