Vijay Deverakonda: ‘THUMS UP’ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

-

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమాను విజయ్ దేవరకొండ చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వరుసగా సినిమా ఆఫర్లతో పాటు కమర్షియల్ యాడ్స్ కూడా హీరో విజయ్ దేవరకొండ కు కలిసి వస్తున్నాయి. సినిమా షూటింగ్ లతో పాటు వరుసగా కమర్షియల్ యాడ్స్ లోనూ విజయ్ దేవరకొండ నటిస్తున్నారు.

ఇక తాజాగా… విజయ్ దేవరకొండ కు మరో బంపర్ ఆఫర్ వచ్చింది. థమ్సప్ బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ ఛాన్స్ కొట్టేశాడు. గత కొన్ని సంవత్సరాలుగా థమ్స్ అప్ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కంటే ముందు చిరంజీవి నటించారు. ఇలాంటి బ్రాండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చింది.

ఈ విషయాన్ని తంసప్ కంపెనీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. చేతిలో సాఫ్ట్ డ్రింక్ పట్టుకుని ఉన్న విజయ్ దేవరకొండ ఫోటోలు షేర్ చేస్తూ… థమ్సప్ సాఫ్ట్ డ్రింక్ కాదు ఇది తుఫాన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ యాడ్ టీవీలో త్వరలోనే టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news