ఎస్మాలకు భయపడం…7వ తేదీ నుంచి సమ్మె చేస్తామని.. పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి ఆస్కార్ రావు పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ గత రెండున్నరేళ్ల కాలంగా ఫ్రంట్ లైన్ వర్కర్లుగా పని చేస్తోన్నా.. అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. కరోనా కాలంలో శెలవులు కూడా ఇవ్వకుండా దుర్మార్గమైన రాక్షస అధికారుల పాలన సాగుతోందని మండిపడ్డారు.
వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణ బాధ్యతలను జేసీలకి అప్పజెప్పొద్దని స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదని.. పీఆర్సీ సాధన విషయంలో సమితి నేతలతో కలిసి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు కూడా ఏడో తేదీన సమ్మెకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని…పీఆర్సీ సమస్యతో పాటు.. వైద్యారోగ్య శాఖ సమస్యలు పరిష్కరించాల్సిందేనని పేర్కొన్నారు. వైద్యారోగ్య శాఖ సమస్యలు పరిష్కారం కాకుంటే మా ఉద్యమం కొనసాగిస్తామనీ.. టెక్నికలుగా ఏ మాత్రం విషయం లేని జేసీలు.. మేం వైద్యం ఎలా చేయాలో చెబుతున్నారన్నారు. మా ఆత్మ గౌరవం దెబ్బతింటోందని.. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు.