2 వేల కుటుంబాలకు విజయ్ సాయం…!

-

కరోనా లాక్ డౌన్ సమయంలో పేదల కష్టాలు తీర్చడానికి గానూ ఎవరి వంతు సహాయం వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు. టాలీవుడ్ లో హీరోలు అందరూ కూడా తమ వంతుగా సహాయం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్ చిన్న హీరోలు విజయ్ దేవరకొండ సహా పలువురు సహాయం చేస్తున్నారు. పేదల కోసం భారీగా తమకు తోచిన్ సహాయం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ ఇటీవల సహాయం చేయడానికి గానూ ముందుకు వచ్చారు. తమ దేవరకొండ ఫౌండేషన్ ద్వారా విజయ్ ఈ సహాయం చేస్తున్నాడు. తాజాగా బిఏ రాజు చేసిన ట్వీట్ లో ఎంత సహాయం చేసారు అని వివరించారు. రెండు వేల కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఆ లక్ష్యాన్ని నేడు చేరుకున్నామని వారికి తమ వంతుగా నిత్యావసర సరుకులను అందిస్తున్నట్టు చెప్పారు.

తమకు సహాయం కావాలని దాదాపుగా 77 వేల అభ్యర్ధనలు వచ్చాయని కాని తమ స్తోమత మేరకు అంత వరకే చేసామని వివరించారు. తాము మిగిలిన వారికి కూడా అందించే ప్రయత్నం చేస్తామని వివరించారు. పేదలకు సహాయం చేయడానికి గానూ తమ వంతుగా ముందుకు రావాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news