యువ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ స్పెషల్ విశెష్ తో పాటుగా స్పెషల్ మెసేజ్ కూడా ఇచ్చాడు. 2018లో రెండు హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు. గీతా గోవిందంతో సూపర్ హిట్ పెయిర్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్, రష్మిక మళ్లీ ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఎప్పటిలానే సినిమాలు చేస్తూ ఉంటానని.. తన ఫ్యాన్స్ హ్యాపీగా కూర్చుని సినిమాలు చూడండని అంటున్నాడు విజయ్. ఏ హీరో చేయని ప్రయోగాలు చేసి ప్రేక్షకులను మెప్పించడమే తన పంథా అంటున్నాడు విజయ్ దేవరకొండ. ఇదే తన ఫ్యాన్స్ కు తానిచ్చే గిఫ్ట్ అంటున్నాడు ఈ రౌడీ హీరో. తనకు వచ్చిన క్రేజ్ ను విజయ్ అదే విధంగా కాపాడుకుంటూ వస్తున్నాడు.