‘నోటా’ విజయ్ రాంగ్ సెలక్షన్

-

విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన నోటా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు రిలీజైన నోటా తమిళ ఆడియెన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుందో ఏమో కాని తెలుగు ఆడియెన్స్ మాత్రం విజయ్ దేవరకొండపై విపరీతమైన నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

అసలు నోటా సినిమా విజయ్ ఎలా ఒప్పుకున్నాడు.. కచ్చితంగా విజయ్ కు నోటా రాంగ్ సెలక్షన్ అనేస్తున్నారు. ఇక పబ్లిక్ టాక్ లో విజయ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందని అందుకే ఇలాంటి సినిమాలు వస్తున్నాయని అంటున్నారు. కథ, కథనాల్లో దర్శకుడు ఏమాత్రం సక్సెస్ అవ్వలేదు.

ఫలితంగా సూపర్ సక్సెస్ లతో మంచి ఫాంలో దూసుకెళ్తున్న విజయ్ కెరియర్ లో నోటా ఫెయిల్యూర్ మూవీగా నిలుస్తుంది. వెరైటీ సినిమాలు చేయొచ్చు కాని ఒక్క డ్యూయెట్ సాంగ్.. కామెడీ.. అసలు హీరోయినే లేకుండా ఎంటర్టైన్మెంట్ కూడా లేని ఇలాంటి సినిమా చేయొద్దు బాబోయ్ అంటూ విజయ్ కు ఆడియెన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news