విజయ్ దర్శకుల మీద ప్రెజర్

-

ప్రస్తుతం టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా మారిన విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో వరుస హిట్లు కొట్టాడు. అర్జున్ రెడ్డితో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ గీతా గోవిందంతో స్టార్ రేంజ్ కు ఎదిగాడు. ఈ సినిమా కలక్షన్స్ స్టార్స్ ను సైతం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన నటించింది.

హ్యాట్రిక్ హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాల మీద ఫోకస్ పెట్టాడు. అయితే వరుస హిట్లు కొడుతున్న విజయ్ తన సినిమాల దర్శకుల మీద ప్రెజర్ పెంచుతున్నాడు. రాబోతున్న టాక్సీవాలా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. ఇక సెట్స్ మీద ఉన్న డియర్ కామ్రేడ్ కూడా క్రేజీగా మారింది. ఈ సినిమా దర్శకుడు భరత్ కమ్మ కొత్తవాడు కావడం వల్ల అతని మీద ప్రెజర్ పడింది.

డియర్ కామ్రేడ్ సినిమాలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి లాంటి ఇంటెన్స్ స్టోరీలో మరోసారి విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. మరి ఈ ప్రెజర్ తట్టుకుని అంచనాలకు తగినట్టే విజయ్ కు మరో హిట్ ఇస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news