నైజాం రాజా.. విజయ్ దేవరకొండ

-

యువ సంచలనం విజయ్ దేవరకొండ సంచలనాలు అన్ని ఇన్ని కావు. మూడంటే మూడే సినిమాలు చేసిన విజయ్ దేవరకొండ ఆ మూడు సినిమాలతోనే స్టార్ క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక లేటెస్ట్ గా వచ్చిన గీతా గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరి తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. గీతా గోవిందం సినిమా నైజాం ఏరియాలో ఏకంగా 19 కోట్ల షేర్ రాబట్టింది. ఈ రేంజ్ లో స్టార్ సినిమాలు అది సూపర్ హిట్ సినిమాలకు వస్తాయి.

ఈ లెక్కన చూస్తే విజయ్ రేంజ్ ఏంటన్నది అర్ధం చేసుకోవచ్చు. నైజాంలో మహేష్, ఎన్.టి.ఆర్, పవన్ లాంటి స్టార్ హీరోల సినిమాలే 19 కోట్ల దగ్గర ఆగిపోయాయి. విజయ్ కూడా వారికి ఈక్వల్ గా వసూళ్లను రాబట్టాడు. తెలంగాణా హీరోగా సత్తా చాటుతున్న విజయ్ నైజాం ఏరియాలో నెలకొల్పిన రికార్డ్ చూస్తే నైజాం కా రాజా అని సంభోదించాల్సిందే. పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు.

16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు 60 కోట్ల షేర్ రాబట్టింది. నైజాం లో 19 కోట్లు వసూళు చేసిన గీతా గోవిందం నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు వచ్చే దాకా మరో కోటి అయినా రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు.

Read more RELATED
Recommended to you

Latest news