బయోపిక్ లో విజయ్ దేవరకొండ.. స్మాల్ ట్విస్ట్..!

-

ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో బయోపిక్ సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. తెలుగులోనే మూడు నాలుగు బయోపిక్ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఇది మొదలు పెట్టిన బాలీవుడ్ లో ఈమధ్య బయోపిక్ సినిమాల జోలికి వెళ్లట్లేదు. లేటెస్ట్ గా కపిల్ దేవ్ బయోపిక్ మళ్లీ అక్కడ సెన్సేషనల్ గా మారింది. 1983లో ఇండియాకు ప్రపంచ కప్ తెచ్చిన సారధి కపిల్ దేవ్. అప్పటి నుండే క్రికెట్ మీద ఇండియాలో క్రేజ్ పెరిగింది.

vijay devarakonda signed bollywood movie

అందుకే కపిల్ దేవ్ బయోపిక్ కు 83 అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేస్తున్నారు. కపిల్ దేవ్ గా రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. అయితే కపిల్ తో పాటుగా ఈ సినిమాలో కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కూడా ఎక్కువ ఉంటుందట. ఆ టైంలో జట్టులో వారిద్దరు మంచి స్నేహంగా ఉన్నారు. అందుకే సినిమాలో ఆ పాత్ర కూడా ప్రాధాన్యత కలిగి ఉంటుందట.

vijay-devarakonda-signed-bollywood-movie

శ్రీకాంత్ పాత్ర కోసం యువ సంచలనం విజయ్ దేవరకొండను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ ఎంట్రీపై కొన్నాళ్లుగా పాజిటివ్ గా స్పందిస్తున్న విజయ్ దేవరకొండకు మొదటి బాలీవుడ్ ఆఫర్ రానే వచ్చింది. 83 సినిమాకు విజయ్ సైన్ కూడా చేశాడని తెలుస్తుంది. మరి మన రౌడీ స్టార్ బీ టౌన్ లో ఇంకెంత హడావిడి చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version