పార్టీ లేదా విజయ్?.. ఫ్యామిలీ స్టార్ కు రష్మిక క్యూట్ క్వశ్చన్

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ , సీతారామం ఫేం మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. గీతా గోవిందం పేం పరశురామ్‌ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గురువారం రోజున ట్రైలర్‌ విడుదల చేసింది. ఈ ట్రైలర్ను చూసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూవీ టీమ్‌ను మెచ్చుకుంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్టులో పార్టీ లేదా అంటూ విజయ్ను అడిగింది. దీనిపై విజయ్ క్యూట్గా రిప్లై ఇచ్చాడు.

‘‘నాకెంతో ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. ఏప్రిల్‌ 5వ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. మీరు తప్పకుండా హిట్‌ కొడతారు. పార్టీ కావాలి!’’ అని అడిగింది. ఈ ట్వీట్పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ ‘క్యూటెస్ట్’ అని రిప్లై ఇచ్చాడు. ఈ వేసవి సెలవుల్లో ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేసే సినిమా ఇది అని విజయ్ తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news